కాయకష్టం చేసి పూల తోటలు సాగు చేస్తే ధర గిట్టుబాటు కావడం లేదంటూ ఓ రైతు వినూత్నంగా నిరసన తెలిపారు. వరంగల్ గ్రామీణ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటకు చెందిన పెండ్లి రమేశ్ నాలుగు ఎకరాల్లో గులాబీ, లిల్లీ పూల తోటలు వేశాడు.
బొడ్రాయీ.. నీవైనా కరుణించాలి...! - వరంగల్ గ్రామీణ జిల్లా తాజా వార్తలు
ఓ వ్యక్తి బస్తా గులాబీలు తీసుకువచ్చి.. ఊర్లోని బొడ్రాయి దగ్గర పోశాడు.. ఇదేమైనా మొక్కు అనుకుంటున్నారా... కానే కాదు.. తనకు వచ్చిన బాధను.. బొడ్రాయి నీవైనా కరుణించాలంటూ... అలా నిరసన తెలిపాడు. అదేంటో తెలుసుకుందాం.
బొడ్రాయీ.. నీవైనా కరుణించాలి...!
గతంలో కిలో గులాబీ పూలు రూ.120 నుంచి 140 వరకు అమ్ముకునేవారు. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.20 నుంచి 30కే అడుగుతున్నారని ఆవేదన చెందుతున్నారు. కూలి ఖర్చులూ రావడం లేదంటూ బుధవారం గ్రామంలోని బొడ్రాయి వద్ద పూలు పోసి నిరసన వ్యక్తం చేశారు.