తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద కొట్లాట - వరంగల్​ నేర వార్తలు

శాయంపేట మండలంలోని మాందారిపేటలో పీఏసీఎస్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద కొట్లాట జరిగింది. ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

a man hit a farmer at grain buying center
ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద కొట్లాట

By

Published : May 16, 2020, 4:58 PM IST

వరంగల్​ రూరల్​ జిల్లా శాయంపేట మండలం మాందారిపేట వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఘర్షణ జరిగింది. గ్రామానికి చెందిన కోరె రమేశ్ తాను పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకొచ్చాడు. అదే సమయంలో తనకంటే వెనుకొచ్చిన వారి ధాన్యం ఖాంటా వేస్తున్నారని నిరసిస్తూ ధాన్యం బస్తాలను దారికి అడ్డంగా పెట్టి ఆందోళన తెలిపాడు.

దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన అదే గ్రామానికి చెందిన భూషబోయిన శ్రీనివాస్​... రమేశ్​తో వాగ్వాదానికి దిగాడు. గొడవ కాస్త కొట్లాటగా మారింది. ఘటనలో రైతు రమేశ్​ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని వరంగల్​లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి :ముద్దు పెట్టినందుకు వెంటాడుతున్న కరోనా..!

ABOUT THE AUTHOR

...view details