వరంగల్ గ్రామీణ జిల్లా నెక్కొండ మండలం పెద్దకోరుప్పలలో నర్సింగోజు రవి ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. అది చనిపోవడంతో చలించిపోయాడు. తన పెంపుడు శునకానికి అంత్యక్రియలు నిర్వహించి ప్రేమను చాటుకున్నాడు. డప్పువాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించాడు.
జిమ్మిపై రవి ప్రేమ... సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు - వరంగల్ గ్రామీణ జిల్లాలో పెంపుడు శునకానికి అంత్యక్రీయలు
పెంపుడు శునకం మృతిచెందడంతో అతడు తల్లడిల్లిపోయాడు. దాని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి తన ప్రేమను చాటుకున్నాడు. ఈ సంఘటన వరంగల్ గ్రామీణ జిల్లాలో జరిగింది.
పెంపుడు శునకంపై ప్రేమ చాడుకున్నాడు
పెద్దకోరుప్పల గ్రామానికి చెందిన నర్సింగోజు రవి ఐదేళ్ల క్రితం ఓ కుక్కపిల్లను ఇంటికి తెచ్చుకుని పెంచుకున్నాడు. దానికి జిమ్మి అని పేరు పెట్టుకున్నాడు. వారి కుటుంబంలో ఒకరిగా విశ్వాసంతో మెలిగిన జిమ్మిపై ఆ కుటుంబ సభ్యులు మమకారాన్ని పెంచుకున్నారు. కాగా ఆ శునకం శుక్రవారం మృతిచెందడంతో తల్లడిల్లిన రవి డప్పువాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి ఖననం చేసి తన ప్రేమను చాటుకున్నాడు.
ఇదీ చదవండి:ఆనంద్ ఆఫ్ కశ్మీర్‌గా పుల్వామా- పాల ఉత్పత్తిలో భేష్