తెలంగాణ

telangana

ETV Bharat / state

అంత్యక్రియలు పూర్తయ్యాక తెలిసింది... కరోనా అని! - కరోనా వ్యాప్తి

ఓ వ్యక్తి చనిపోయాడు. అతనికి కుటుంబసభ్యులు, గ్రామస్థులు, స్నేహితులు కన్నీటి వీడ్కోలు చెప్పారు. అంత్యక్రియలు ముగిశాక వారి వారి స్వగృహాలకు వెళ్లారు. ఇంతవరకు బాగానే ఉన్నా... అప్పుడే వారికో విషయం తెలిసింది. అతను కరోనాతో చనిపోయాడని. ఇంకేముంది అందరిలోనూ టెన్షన్ మొదలైంది.

A man died with a corona, late diagnosis at warangal
కరోనాతో వ్యక్తి మృతి... ఆలస్యంగా నిర్ధరణ

By

Published : Apr 15, 2021, 2:11 PM IST

రాష్ట్రంలో కరోనా కలకలం కొనసాగుతోంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మంగళవారం రాత్రి మరణించగా.. అతనికి కొవిడ్‌ పాజిటివ్‌ అని ఆలస్యంగా తెలిసింది. బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తర్వాత ఆశా వర్కర్ మొబైల్‌కు అతను కరోనా బారినపడినట్లు సమాచారం వచ్చింది.

అంత్యక్రియలకు హాజరైన గ్రామస్థులు ఈ విషయంపై ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేకంగా దృష్టి సారించిన వైద్యాధికారులు క్యాంప్‌ నిర్వహించి లక్షణాలు ఉన్నావారిని పరీక్షిస్తున్నారు. ఏనుగల్‌లో ఇప్పటికే 20 మందికి పైగా కరోనా పాజిటివ్‌ ఉందని తేలింది. గ్రామస్థులు గృహ నిర్భంధంలోకి వెళ్లిపోగా.. రాకపోకలు బహిష్కరించారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో మరో 3,307 కరోనా కేసులు, 8 మరణాలు

ABOUT THE AUTHOR

...view details