తెలంగాణ

telangana

ETV Bharat / state

చెట్టుపైనే ప్రాణాలొదిలిన గౌడన్న - A Man Dead

వారి ప్రాణాలు గాల్లో దీపాలు. ఇంటి నుంచి బయటకు వెళ్లారంటే తిరిగి వస్తారో రారో తెలియని జీవితాలు వారివి. చెట్టు ఎక్కి కల్లు తీయడమే వారి జీవనాధారం. పది రూపాయల కోసం ప్రాణాన్నే పణంగా పెట్టి వందడుగుల చెట్టు ఎక్కాల్సిన పరిస్థితి. ఈ ఆకలి పోరాటంలో అసువులు బాసినవారెందరో.. అయినా తప్పని వారి జీవన పోరాటం. వారే కల్లు గీత కార్మికులు. తాజాగా వరంగల్​ గ్రామీణ జిల్లాలో ఓ గీత కార్మికుడు చెట్టుపైనే ప్రాణాలు విడిచాడు.

palm tree
గీత కార్మికులు

By

Published : Feb 14, 2020, 9:18 PM IST

Updated : Feb 14, 2020, 11:18 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లాలో ఓ గీత కార్మికుడు చెట్టుపైనే ప్రాణాలు విడిచాడు. రాయపర్తి మండలం కొండాపురంకు చెందిన బండారి భిక్షం రోజులాగే కల్లు కోసం తాటి చెట్టు ఎక్కాడు. ఏమైందో ఏమో కానీ చెట్టుపైనే ప్రాణాలు వదిలాడు. భిక్షం మృతితో గ్రామంలో విషాధ ఛాయలు నెలకొన్నాయి.

గీత కార్మికులు
Last Updated : Feb 14, 2020, 11:18 PM IST

ABOUT THE AUTHOR

...view details