Gang Stealing Diesel: వరంగల్ గ్రామీణ జిల్లాలో నిలిపి ఉన్న వాహనాలలో డీజిల్ చోరీకి పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్లు. గత కొన్ని రోజులుగా వాహనాల్లో డీజిల్ మాయమవుతుందని గమనించిన లారీ అసోసియేషన్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఓ లారీలో నుంచి డీజిల్ తీస్తుండగా ఆ ముఠాను పోలీసులు గుర్తించి వెంబడించగా వర్ధన్నపేట మండలం మీదుగా వెళుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది.
Gang Stealing Diesel లారీల నుంచి డీజిల్ చోరి - Theft of diesel in vehicles latest news
Gang Stealing Diesel రహదారిపై నిలిపి ఉన్న లారీల నుంచి డీజిల్ చోరికి పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్లు. ఏకంగా నిందితులు సొంతంగా లారీని ఏర్పాటు చేసుకొని అందులో డ్రమ్ములను అమర్చి మోటార్ల సాయంతో గుట్టుచప్పుడు కాకుండా డీజిల్ దొంగిలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ లారీలో నుంచి డీజిల్ తీస్తుండగా గుర్తించిన పోలీసులు ముఠాను పట్టుకునే క్రమంలో చేతికి చిక్కినట్టే చిక్కి తృటిలో తప్పించుకున్నారు.
![Gang Stealing Diesel లారీల నుంచి డీజిల్ చోరి లారీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16183511-682-16183511-1661324719805.jpg)
లారీ
దీంతో డీజిల్ ముఠా వినియోగిస్తున్న లారీ పట్టుబడగా నిందితులు పరారయ్యారు. పట్టుబడిన లారీలో 8000 లీటర్ల సామర్థ్యం కలిగిన డ్రమ్ములను అమర్చి వాహనాల నుంచి డీజిల్ తీసేందుకు మోటారు, పైపులను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. నిందితులకోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
లారీల నుంచి డీజిల్ చోరి