వరంగల్ గ్రామీణ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పొలం పనులకు వెళ్లిన రైతు శవమయ్యాడు. వర్ధన్నపేట మండలం నల్లబెల్లికి చెందిన రైతు వీరన్న ఎప్పటిలాగే వ్యవసాయ పనుల దృష్ట్యా పొలానికి ట్రాక్టర్ తో వెళ్ళాడు.
రైతు ప్రాణం తీసిన ట్రాక్టర్.. - వరంగల్ గ్రామీణ జిల్లా
ఎప్పటిలాగే వ్యవసాయ పనులపై పొలానికి ఆ రైతు విగతజీవిగా మారాడు. పొలంలో ట్రాక్టర్ తో పనిచేస్తుండగా..ఆ ట్రాక్టరే అతని ప్రాణాలు తీసింది. ఈ విషాదకర ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా నల్లబెల్లిలో చోటుచేసుకుంది.
రైతు ప్రాణం తీసిన ట్రాక్టర్..
ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా పల్టీ కొట్టడంతో ట్రాక్టర్ పై ప్రయాణిస్తున్న వీరన్న.. అదే ట్రాక్టర్ కిందపడి ఊపిరాడక మృతి చెందాడు. జేసీబీ సహాయంతో ట్రాక్టర్ ను తొలగించాల్సి వచ్చింది. వీరన్న మృతితో నల్లబెల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చదవండి: గ్రామపంచాయతీ ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు