వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో 5 కిలోల బరువు ఉన్న ఆడ శిశువు జన్మించింది. ఇల్లంద గ్రామానికి చెందిన ఝాన్సీకి 5 కిలోల ఆడ శిశువు పుట్టినట్లు ఆసుపత్రి సూపరిండెంట్ నరసింహ స్వామి వెల్లడించారు.
వర్ధన్నపేటలో 5 కిలోల బరువు ఉన్న శిశువు జననం - telangana news
5 కిలోల బరువు ఉన్న ఆడశిశువు జన్మించిన ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చోటుచేసుకుంది. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వెయ్యి మందిలో ఇలా ఒకరు అధిక బరువుతో పిల్లలు పుడతారని పేర్కొన్నారు.
baby
రెండు నుంచి నాలుగు కిలోలలోపు సాధారణ జననాలు జరుగుతాయని వెయ్యి మందిలో ఒకరికి ఇలా అధిక బరువుతో పిల్లలు జన్మిస్తారని ఆయన తెలిపారు. ఇదొక అద్భుతమని తెలిపిన డాక్టర్లు తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.