తెలంగాణ

telangana

ETV Bharat / state

18 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్

వరంగల్ గ్రామీణ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 18 కిలోల గంజాయిని పరకాల పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

18kgs ganja handover by parakala police, warangal rural district
అక్రమంగా తరలిస్తున్న 18 కిలోల గంజాయి స్వాధీనం

By

Published : Jan 25, 2021, 7:43 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా పరకాలలో 18 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని స్థానిక పోచమ్మ గుడి వద్ద వాహన తనిఖీలు నిర్వహించగా... ఆటోలో తరలిస్తున్న గంజాయిని గుర్తించినట్లు పరకాల ఏసీపీ శ్రీనివాస్​ తెలిపారు. దాని విలువ దాదాపు లక్ష రూపాయలకు పైనే ఉంటుందని పేర్కొన్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని, వారితో పాటు మరొక వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ఇతర ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకువచ్చి అమాయకపు యువతకు వ్యసనంగా మారుస్తున్నారని ఏసీపీ తెలిపారు. దాని ప్రభావం వారిపై వితరీతంగా ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మొదటి సారిగా పరకాలలో గంజాయి పట్టుకున్నామని, దీన్ని అరికట్టేందుకు ప్రజలంతా తమకు సహకరించాలని కోరారు.

ఇదీ చదవండి: హైదరాబాద్​లో రైతుల ర్యాలీకి హైకోర్టు అనుమతి

ABOUT THE AUTHOR

...view details