18 Years Handicapped Man Story in Warangal ఆదుకోండి సర్.. ఉపాధికి దారి చూపించండి 18 Years Handicapped Man Story in Warangal :కన్న బిడ్డకు.. చిన్నప్పుడు అన్నీ పనులూ.. తల్లి ఆనందంగా చేస్తుంది. అదే అతనికి 18 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత కూడా చేయాలంటే.. ఏ తల్లికైనా ఇబ్బందే. అయినా కష్టాన్ని దిగమింగుకుని.. ఈ తల్లిదండ్రులు సాధ్యమైనంతవరకూ కన్న కుమారుడికి ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.
వివరాల్లోకి వెళితే..:వరంగల్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామంలోని సోమలక్ష్మి, సైదుల చిన్న కుమారుడు విష్ణు. చిన్ననాడే పాఠశాలకు వెళ్తున్న సమయంలో లారీప్రమాదం.. ఇతని రెండు కాళ్లూ పోగొట్టింది. అప్పటి నుంచి ఇదిగో.. ఇలా రెండు చేతుల సాయంతో నడవలేక నడుస్తూ జీవనం సాగిస్తున్నాడు. కనీసం చక్రాల కుర్చీ కూడా లేకపోవడంతో.. ఎండకైనా, వానకైనా విష్ణు ఇలా నడవాల్సిందే. ఎక్కడికైనా కాస్త దూరం వెళ్లాల్సి వస్తే.. తల్లిదండ్రులు చిన్నపిల్లాడిని ఎత్తుకున్నట్లుగా విష్టుని తీసుకెళ్తారు.
Special Story on 18 Years Handicapped Man :కూలీ నాలి చేసుకునే ఈ దంపతులు.. కుమారుడి కష్టం చూసి కన్నీటి పర్యంతమౌతున్నారు. బాగోగులు చూసుకునేందుకు ఒకరు కూలికి వెళితే.. మరొకరు ఇంటిపట్టునే ఉండిపోతున్నారు. ఫించన్ డబ్బులు వచ్చినా అవి సరిపోవట్లేదని ఆవేదన చెందుతున్నారు ఆ తల్లిదండ్రులు.
Handicapped Woman Story in Hanamkonda : సంకల్పం ముందు.. ఓడిన వైకల్యం!
'ఇప్పటికీ 18 ఏళ్ల నుంచి అన్ని చూసికుంటూ వస్తున్నా. నేను ఏటైన వెళితే చాలా ఇబ్బంది అవుతోంది. అబ్బాయి దగ్గర నేను లేదా నా భర్త ఎవరోకరు ఉండాలి. తోటి వాళ్లను చాస్తే.. నాకు చాలా బాధైపోతుంది. వాళ్లంతా అలా నడిచి వెళ్తుంటే నా కొడుకు మాత్రం ఇలా అయ్యాడని.. రోజు ఎడవడం సరిపోతుంది. మేం ఉన్నాం కాబట్టి రోజు ఇలా చూసుకుంటున్నాం. రేపు మేం పోతే కొడుకుని ఎవరు చూసుకుంటారని దిగిలైపోయింది. 18 ఏళ్ల నుంచి నా కొడుకు చూసి ఏడుస్తూనే ఉన్నా.' -సోమలక్ష్మి, విష్ణు తల్లి
పదో తరగతి వరకూ అతి కష్టం మీద చదివినా.. ఆ తర్వాత ఆర్థిక పరిస్థితులు అనుకూలించక విష్ణు చదువు మానేశాడు. కంప్యూటర్‌లో బేసిక్స్(Computer Basics) మాత్రం నేర్చుకున్నాడు. దాతలు పెద్ద మనస్సుతో దయ చూపిస్తే.. కాళ్లు లేకున్నా.. ఎంతో కొంత సంపాదించి ఆర్థికంగా నిలదొక్కుకుంటానని ఆత్మవిశ్వాసంతో చెపుతున్నాడు విష్ణు.
'మా అమ్మానాన్న కలిసి ఎంతో కష్టపడి నన్ను ఎత్తుకొని తీసుకెళ్లి.. ఎలాగోలా పదోవ తరగతి వరకు చదివించారు. ఇప్పుడు నేను కంప్యూటర్ గురించి బేసిక్స్ నేర్చుకున్నాను. ఒక షాపు పెట్టుకుని నా కాళ్లమీద నేను నిలబడదం అనుకుంటున్నాను. ఇలా నేను చేయాలి అంటే ఎంతో కొంత సాయం కావాలి. షాపు లాంటిది పెట్టుకుంటే ఒకరి మీద ఆదారపడకుండా బతుకుతా. ఎవరైనా సాయం చేస్తే బాగుంటుంది.' -విష్ణు, బాధితుడు
Special Story on Medical Student Mahender : డాక్టర్ అయ్యేందుకు స్పీడ్ బ్రేకర్‌గా పేదరికం.. ఎవరైనా సాయం చేస్తే..!
అంగ వైకల్యం శరీరానికే.. ఆత్మవిశ్వాసానికి కాదు