వరంగల్ మహా నగరంలో 150 అడుగుల జాతీయజెండా రెపరెపలాడనుంది. మేయర్ గుండా ప్రకాశ్‌రావు సూచనతో జాతీయ పతాకాన్ని అనువైన కూడలిలో ఏర్పాటు చేసేందుకు వరంగల్ మహా నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టారు. భారీ జెండాను చూసిన వెంటనే జాతీయ భావాన్ని, దేశభక్తిని పెంచేలా ఉండాలని, అందుకు అనువైన స్థలాన్ని అధికారులు అన్వేషిస్తున్నారు. బల్దియా సాధారణ నిధుల నుంచి రూ.26 లక్షలను కేటాయించేందుకు రంగం సిద్ధమైంది. వరంగల్ రైల్వేస్టేషన్, పోచమ్మమైదాన్‌లోని రాణిరుద్రమ కూడలి, బల్దియా ప్రధాన కార్యాలయం, భద్రకాళి బండ్, హన్మకొండలోని పబ్లిక్‌గార్డెన్ స్థలాలు ప్రాథమికంగా పరిశీలనలో ఉన్నాయి.
150 అడుగుల జాతీయ జెండా ఏర్పాటుకు రంగం సిద్ధం
చూడగానే దేశభక్తి పెంపొందేలా వరంగల్ మహా నగరంలో 150 అడుగుల జాతీయ జెండాను ఏర్పాటు చేయనున్నారు. మేయర్ గుండా ప్రకాశ్‌రావు సూచనతో ఇందుకు అనువైన స్థలం కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. బల్దియా సాధారణ నిధుల నుంచి రూ. 26 లక్షలు కేటాయించేందుకు రంగం సిద్ధమైంది.
జాతీయ జెండా