వనపర్తిలో మలేరియాపై అవగాహన ర్యాలీ
మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా వనపర్తిలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్యసిబ్బంది, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ
ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ చేపట్టారు. వనపర్తి ఆర్డీవో వెంకటయ్య ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. దోమ కాటు వలన వ్యాపించే మలేరియా ప్రాణాంతకమైనదని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల దోమలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. జూనియర్ కళాశాల నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు, జిల్లా వైద్య సిబ్బంది పాల్గొన్నారు.