వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పుల్యాతండాకు చెందిన మెగావత్ బాల్యనాయక్, మన్నెమ్మ దంపతులు హైదరాబాద్లో జీవనం కొనసాగించేవారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక సొంత తండాకు వచ్చారు. ఈ క్రమంలో బాల్య నాయక్ భార్యపై అనుమానం పెంచుకున్నాడు. నిత్యం వీరి మధ్య గొడవులు జరుగుతుండేవి.
కూతురి సాయంతో భర్త గొంతు కోసి చంపేసింది.. - వనపర్తి క్రైమ్ వార్తలు
అనుమానంతో ఆ భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. వేధింపులు సహించలేక పోయిన భార్య... కూతురి సాయంతో భర్త గొంతు కోసి హత్య చేసిన ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
భర్త గొంతు కోసి హత్య చేసిన భార్య
విసుగు చెందిన మన్నెమ్మ కూతురు సాయంతో మంగళవారం రాత్రి నిద్రిస్తున్న భర్త గొంతును కత్తితో కోసి చంపేసింది. వనపర్తి డీఎస్పీ కిరణ్కుమార్, కొత్తకోట సీఐ వై. మల్లికార్జున్ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాము తెలిపారు.