తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజావాణి ఫిర్యాదులను వాట్సాప్​ చేయండి: వనపర్తి కలెక్టర్​ - వనపర్తి జిల్లా వార్తలు

వనపర్తిలో వివిధ సమస్యల పరిష్కారం కోసం ఫిర్యాదులు సమర్పించేందుకు కొందరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. వారి ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా కలెక్టర్​ షేక్​ యాస్మిన్​.. కరోనా వైరస్ పూర్తిగా తగ్గనందున కార్యాలయానికి రానవసరం లేదన్నారు. ఫిర్యాదులను ఫోన్​ నెంబర్​ 7780580106 కు వాట్సాప్ ద్వారా పంపించాలని కోరారు.

ప్రజావాణి ఫిర్యాదులను వాట్సాప్​ చేయండి: వనపర్తి కలెక్టర్​
ప్రజావాణి ఫిర్యాదులను వాట్సాప్​ చేయండి: వనపర్తి కలెక్టర్​

By

Published : May 11, 2020, 5:31 PM IST

ప్రజావాణి ఫిర్యాదులను ఫోన్​ నెంబర్​ 7780580106 కు వాట్సాప్ ద్వారా పంపించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. సోమవారం వివిధ సమస్యల పరిష్కారం కోసం కొంతమంది ఫిర్యాదులు సమర్పించేందుకు కలెక్టర్ కార్యాలయానికి రాగా వారి ఫిర్యాదులను స్వీకరించారు. అలాగే కరోనా వైరస్ పూర్తిగా తగ్గనందున జిల్లా ప్రజలు ఫిర్యాదులను సమర్పించేందుకు వనపర్తికి రావాల్సిన అవసరం లేదన్నారు. పైన పేర్కొన్న ఫోన్ నెంబర్​కు వారి ఫిర్యాదులను వాట్సాప్ చేయాలని చెప్పారు.

వాట్సాప్​కు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత అధికారులకు తక్షణమే వాటిని పంపించి పరిష్కార చర్యలు తీసుకుంటామని యాస్మిన్​ తెలిపారు. ఇందుకుగాను ఎక్కువగా ఫిర్యాదులు వచ్చే డీఆర్డీవో, రెవెన్యూ తదితర శాఖల అధికారులు వాట్సాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పింఛన్లు, ఇసుక, వ్యక్తిగత సమస్యలకు సుమారు పదిమంది ఫిర్యాదు ఇచ్చారు.

ఇదీ చూడండి:ప్రధానికి ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారు..?

ABOUT THE AUTHOR

...view details