రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికలను నాణ్యతతో నిర్మించాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. వనపర్తి జిల్లా కొత్తకోట, పెద్దమందడి మండలాల్లో నిర్మిస్తున్న రైతు వేదికలను ఆమె శనివారం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు వేదికల నిర్మాణాలను అక్టోబర్ 5 నాటికి పూర్తిచేసి అప్పగించాలని ఆదేశించారు.
'నాణ్యత లోపం ఉంటే బిల్లు మంజూరు నిలిపివేయండి' - wanaparthy collectorr yasmin basha latest news
వనపర్తి జిల్లా కొత్తకోట, పెద్దమందడి మండలాల్లో నిర్మిస్తున్న రైతు వేదిక భవనాలను కలెక్టర్ యాస్మిన్ బాషా పరిశీలించారు. అక్టోబర్ 5 లోపు జిల్లావ్యాప్తంగా 71 రైతు వేదికల నిర్మాణాన్ని పూర్తి నాణ్యతతో నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
!['నాణ్యత లోపం ఉంటే బిల్లు మంజూరు నిలిపివేయండి' yasmin basha visited rythu vedika constructions](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8948452-447-8948452-1601122247677.jpg)
'నాణ్యత లోపం ఉంటే బిల్లు మంజూరు నిలిపివేయండి'
జిల్లావ్యాప్తంగా 71 రైతు వేదికలను నిర్మిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. వర్షం వల్ల నిర్మాణాలు ఆగినప్పటికీ రెట్టింపు వేగంతో పనులు చేయాలని ఆమె సూచించారు. జిల్లాలో నిర్మిస్తున్న 71 రైతు వేదికల్లో 34 బేస్మెంట్ స్థాయిలో ఉండగా.. 19 లెంటల్ స్థాయిలో, 11 రూఫ్ స్థాయిలో, మరో 2 రూఫ్ పూర్తయ్యాయని, మరో 5 చివరి దశలో ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఇదీ చూడండి :నిండుకుండలా మారిన దిగువ మానేరు జలాశయం