వనపర్తి ఆర్టీసి డిపో పరిధిలోని కార్మికులు ఉదయం 3 గంటల నుంచే విధుల్లో చేరారు. అంతకు ముందే వారు గేటు ముందు సమావేశం ఏర్పాటు చేసుకుని విధి విధానాల గురించి చర్చించుకున్నారు. డిపోలో డ్రైవర్లు, మెకానిక్లు, కండక్టర్లు ఇతర సిబ్బందితో మొత్తం 480 మంది కార్మికులు విధుల్లో చేరుతున్నట్లు తెలిపారు. రిజిస్టర్లో తమ పేర్లు నమోదు చేసుకుంటూ తమకు కేటాయించిన రూట్లలో బస్సులు నడుపుతున్నారు. మెకానిక్లు కూడా గ్యారేజీల వద్దకు చేరుకొని తమ పనులను ప్రారంభించారు.
విధివిధానాలపై చర్చించుకున్న ఆర్టీసీ కార్మికులు - విధివిధానాలపై చర్చించుకున్న వనపర్తి ఆర్టీసీ కార్మికులు
వనపర్తి జిల్లాలో దాదాపు 480 మంది కార్మికులు ఉదయం 3 గంటల నుంచే డిపోల వద్ద క్యూ కట్టారు.
విధివిధానాలపై చర్చించుకున్న ఆర్టీసీ కార్మికులు