తెలంగాణ

telangana

ETV Bharat / state

అందరికీ ఆదర్శమయ్యేలా.. విధులు నిర్వహిద్దాం: ఎస్పీ - sp meeting with officers and staff at the district police office.

కొత్త సంవత్సరం సందర్భంగా .. వనపర్తి ఎస్పీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

wanaparthy sp held a special meeting with officers and staff at the district police office.
మన్ననలు పొందేలా విధి నిర్వహణ చేద్దాం: వనపర్తి ఎస్పీ

By

Published : Jan 1, 2021, 10:30 PM IST

ఈ నూతన సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని వనపర్తి జిల్లా ఎస్పీఅపూర్వ రావు పేర్కొన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా .. జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందితో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో కేక్ కట్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. . క్లిష్టమైన సంవత్సరం దాటుకుని 2021లోకి ప్రవేశించామని .. అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆకాంక్షించారు.

ప్రజలను మెప్పించేలా..

లాక్ డౌన్ సమయంలో తమకు కరోనా సోకినా ప్రజల క్షేమం ముఖ్యమని భావించి సేవలు అందించిన పోలీసు అధికారులు, సిబ్బంది చేసిన కృషిని ఎస్పీ అభినందించారు. ఈ నూతన సంవత్సరంలోనూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలను మెప్పించేలా.. వారి అభిమానం, మన్ననలు పొందే విధంగా విధి నిర్వహణ చేయాలని సూచించారు.

గౌరవాన్ని పెంచేలా..

ప్రజల దృష్టిలో పోలీసులంటే న్యాయం చేసే వారని, పోలీస్‌స్టేషన్‌కు వెళితే న్యాయం లభిస్తుందనే నమ్మకాన్ని ప్రజలలో కల్పించడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. అదే సమయంలో చట్టాలను గౌరవించే ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తూ పోలీసుశాఖ గౌరవాన్ని పెంచేలా పని చేయాలన్నారు

ఇదీ చదవండి:సూర్యాపేటలో ఒకే కుటుంబంలో 22 మందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details