లాక్డౌన్ నిబంధనలు అమలులో ఉన్నప్పటికి రోడ్ల పైకి వచ్చే వాహనదారులకు వనపర్తి పోలీసులు వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. కరోనా వైరస్ ఆకారం గల హెల్మెట్, నల్లటి వస్త్రాలు ధరించిన పోలీసులు రహదారుల వెంట తిరుగుతూ ప్రజలను బయటకు రావద్దంటూ ప్రచారం చేస్తున్నారు.
వైరస్‌పై అవగాహనకు పోలీసుల వినూత్న ప్రయత్నం - కరోనా
కరోనా లాక్డౌన్ పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు పోలీసు యంత్రాంగం శతవిధాల ప్రయత్నిస్తుంది. వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు నిత్యం కృషి చేస్తుంది. తాజాగా వనపర్తి జిల్లా పోలీసులు కూడా ఇదే బాట పట్టారు. వైరస్‌ను పోలిన హెల్మెట్‌తో, నల్లటి వస్త్రాలు ధరించిన పోలీసులు ప్రజల్ని బయటకు రావద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
వైరస్‌పై అవగాహనకు పోలీసుల వినూత్న ప్రయత్నం
అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. బయటికి వస్తే వైరస్ బారినపడి కుటుంబాలు ఇబ్బందుల పాలవుతాయని సూచిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన ప్రాంతాలైన రాజీవ్ గాంధీ చౌరస్తా, అంబేడ్కర్ చౌరస్తా, పొట్టి శ్రీరాములు చౌరస్తా, గాంధీ చౌక్ రామాలయం ప్రాంతాల్లో పోలీసులు ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఇవీచూడండి:పోలీస్ ఆర్కెస్ట్రా: లాక్డౌన్లో వినోదం హోమ్ డెలివరీ