వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డులో ఏకగ్రీవ తీర్మానం జరిగింది. వార్డు నుంచి ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడం వల్ల ఏకగ్రీవ కౌన్సిలర్‌గా తెరాస అభ్యర్థి మెగావత్ శాంతమ్మను మున్సిపల్ అధికారులు ప్రకటించారు.
'ప్రజలు తెరాస పక్షమే అనడానికి ఈ ఏకగ్రీవమే నిదర్శనం' - వనపర్తి మున్సిపాలిటీలో తెరాస అభ్యర్థి ఏకగ్రీవం
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డులో తెరాస అభ్యర్థి మెగావత్ శాంతమ్మ అనే గిరిజన మహిళ.. ఏకగ్రీవంగా కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు.
'ప్రజలు తెరాస పక్షమే అనడానికి ఈ ఏకగ్రీవమే నిదర్శనం'
తెరాస తరఫున తొలి మహిళా అభ్యర్థి కౌన్సిలర్‌గా ఎన్నికైనందుకు శాంతమ్మను వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అభినందించారు. రాష్ట్రంలో ప్రజలు తెరాస వైపు ఉన్నారన్న శుభ సూచికమై... శాంతమ్మ ఏకగ్రీవమని పేర్కొన్నారు.
వనపర్తి మున్సిపాలిటీ నుంచి తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఐదో వార్డు ప్రజలకు శాంతమ్మ కృతజ్ఞతలు తెలిపారు.
- ఇదీ చదవండీ... నేటితో 'పల్లె ప్రగతి 2.o' ముగింపు