వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ అపూర్వరావు ప్రారంభించారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని ఆమె అన్నారు. మండల కేంద్రంలోని అన్ని వీధులు ఇప్పుడు పోలీసుల పర్యవేక్షణలో ఉంటాయని తెలిపారు.
'ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం' - శ్రీరంగాపురంలో సీసీ కెమెరాల ప్రారంభం వార్త
ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వరావు అన్నారు. శ్రీరంగాపురం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కెమెరాలను ఆమె ప్రారంభించారు. ప్రతి గ్రామంలో వీటి ఏర్పాటుకు దాతలు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని కోరారు.
సీసీ కెమెరాలను ప్రారంభించిన వనపర్తి జిల్లా ఎస్పి
సీసీ కెమెరాల ఏర్పాటు కోసం దాతలు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ప్రతి గ్రామంలో ఏర్పాటుకు దాతలు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని కోరారు. పోలీస్స్టేషన్లో దస్త్రాలను పరిశీలించి, కేసుల పురోగతిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండి: పనులను త్వరగా పూర్తి చేయండి: తలసాని