రైతు వేదిక నిర్మాణాల్లో అలసత్వం వహించే గుత్తేదారులపై కఠిన చర్యలుంటాయని వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా హెచ్చరించారు. పెద్దమందడి, ఖిల్లాఘనపురం మండలాల్లో పర్యటించిన కలెక్టర్.. గడువు దగ్గరికొస్తున్నా నిర్మాణాలు పూర్తికాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
రైతు వేదిక భవనాల నిర్మాణాల్లో అలసత్వంపై కలెక్టర్ ఆగ్రహం - collector yasmin basha
రైతు వేదిక నిర్మాణాల్లో జాప్యం వహిస్తున్న గుత్తేదారులపై వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దమందడి, ఖిల్లాఘనపురం మండలాల్లో పర్యటించి రైతు వేదిక భవన నిర్మాణాలను పరిశీలించారు.
![రైతు వేదిక భవనాల నిర్మాణాల్లో అలసత్వంపై కలెక్టర్ ఆగ్రహం wanaparthy district collector yasmin basha wanaparthy district collector yasmin basha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9147114-220-9147114-1602501371049.jpg)
వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా
నిర్మాణాల్లో అలసత్వం వహించే గుత్తేదారులకు నిధుల మంజూరులో గ్రామపంచాయతీ బాధ్యత వహించాలని, నిధులు గ్రామ పంచాయతీ ఖాతాలోనే జమ చేస్తామని కలెక్టర్ తెలిపారు. దసరా పండుగ నాటికి జిల్లా పరిధిలోని 71 రైతు వేదికలు ప్రారంభానికి తయారు కావాలని అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు. ఎక్కజైనా జాప్యం జరిగితే సంబంధింత గ్రామ సర్పంచ్, గుత్తేదారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్మాణాల్లో నాణ్యత లోపం ఉండకుండా.. పటిష్ఠంగా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.