తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆత్మకూర్​ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి: కలెక్టర్​ - Wanaparthy District Collector Yasmin Basha

పారిశుద్ధ్యం, పచ్చదనంతో ఆత్మకూర్​ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని వనపర్తి కలెక్టర్​ యాస్మిన్​ బాష ఆదేశించారు. ఆరో విడత హరతహారంలో భాగంగా పట్టణంలో మొక్కలు నాటారు.

Wanaparthy District Collector Yasmin Basha said that  Atmakur is an ideal municipality
ఆత్మకూర్​ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి

By

Published : Jul 8, 2020, 6:40 PM IST

వనపర్తి జిల్లాలోని ఆత్మకూర్, మదనాపురం, నాగవరం ప్రాంతాల్లో కలెక్టర్​ యాస్మిన్​ బాష పర్యటించారు. ఆరో విడత హరితహారంలో భాగంగా ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. అనంతరం నర్సరీ, డంపింగ్​ యార్డ్​, వైకుంఠదామాన్ని పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 47.63 లక్షల మొక్కలను పెంచనున్నట్లు వెల్లడించారు. దీనిలో భాగంగా పట్టణానికి లక్ష మొక్కలు ఇచ్చినట్టు తెలిపారు.

మున్సిపల్​ అధికారుల పనితీరు పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ప్రతిఒక్కరూ తమ బాధ్యతను నిర్వహిస్తూ పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ గాయత్రి, మున్సిపల్ కమిషనర్ కృష్ణయ్య పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details