వనపర్తి జిల్లాను అన్ని రంగాల్లో ప్రథమస్థానంలో నిలిపేందుకు ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని జిల్లా పాలనాధికారి యాస్మిన్ భాష పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆమె ఆవిష్కరించారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం ఆమె స్వీకరించారు. విధి నిర్వహణలో ప్రతిభ చూపిన ఉద్యోగస్తులను ప్రశంసా పత్రాలను మంత్రి నిరంజన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా వేదికపై స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు.
వనపర్తిని ప్రథమ స్థానంలో నిలపాలి : యాస్మిన్ భాష - minister niranjan participated in republic day celebrations
ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు జిల్లాను ప్రథమస్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష సూచించారు. జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ మైదానంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం ఆమె స్వీకరించారు.
అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేస్తున్న కలెక్టర్, మంత్రి నిరంజన్ రెడ్డి
గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రగతి నివేదికను చదివి వినిపించారు. జిల్లా పరిధిలో మృతి చెందిన 218 మంది రైతులకు బీమా పథకం ద్వారా రూ.10 కోట్ల 90 లక్షల రూపాయలు అందించినట్లు తెలిపారు. రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించే దిశగా 27 క్లస్టర్లలో రూ.15 కోట్ల 62 లక్షల వ్యయంతో రైతు వేదికలను నిర్మించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఎస్పీ షాకీర్ హుస్సేన్, జడ్పీ ఛైర్మన్ లోకనాథ్ రెడ్డి, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.