ఎల్ఆర్ఎస్ పరిధిలోని ప్లాట్లు, లేఅవుట్లు తదితర నిర్మాణాలను అక్టోబర్ 15లోగా నమోదు చేసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా సూచించారు. ప్రతి ఒక్కరు రాష్ట్ర సర్కార్ కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అక్టోబర్ 15 దాటితే అనుమతులు కష్టమే: కలెక్టర్ యాస్మిన్ భాషా - rythu vedika buildings in wanaparthy
అక్టోబర్ 15లోగా ప్రభుత్వం కల్పించిన ఎల్ఆర్ఎస్ సవరణల అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా సూచించారు. ఎల్ఆర్ఎస్ పరిధిలోని ప్లాట్లు, లేఅవుట్లు తదితర నిర్మాణాలను గడువులోగా నమోదు చేసుకోవాలని తెలిపారు.
![అక్టోబర్ 15 దాటితే అనుమతులు కష్టమే: కలెక్టర్ యాస్మిన్ భాషా wanaparthy district collector sheik yasmin bhasha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8921853-9-8921853-1600948943294.jpg)
వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా
పెద్దమందడి ఖిల్లా గణపురం మండలాల్లో పర్యటించిన కలెక్టర్ యాస్మిన్ భాషా.. రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాల నిర్మాణాలను పరిశీలించారు. పంచాయతీ పరిధిలో అనుమతుల్లేని నిర్మాణాలకు నీటి సరఫరా, విద్యుత్ సరఫరా వంటి సదుపాయాలు పూర్తిగా తొలగిస్తారని హెచ్చరించారు. అక్టోబర్ 30నాటికి పల్లెలో నిర్మిస్తున్న ప్రకృతి వనాలు, సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.