తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్త నర్సరీల పెంపు వేగవంతం చేయాలి : కలెక్టర్ - పెండింగ్​ పనులు పూర్తి చేయాలన్న కలెక్టర్ యాస్మిన్​ భాష

రాష్ట్రప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో కొత్త నర్సరీల పెంపు, విత్తనాలు నాటడం వెంటనే పూర్తి చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆర్డీవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

wanaparthy dist  collector yasmin bhasha meeting on to complete nurseries works
సమీక్షలో మాట్లాడుతున్న జిల్లా కలెెక్టర్ యాస్మిన్​ భాష

By

Published : Jan 19, 2021, 10:26 PM IST

జిల్లాలో కొత్త నర్సరీల ప్రక్రియను పూర్తి చేయడం, హరితహారం కింద నిర్మించిన వాచ్​ అండ్​ వార్డులకు తక్షణమే చెల్లింపులు చేయాలని వనపర్తి జిల్లా పాలనాధికారి యాస్మిన్​ బాషా అధికారులను ఆదేశించారు. కొత్త నర్సరీల పెంపు, విత్తనాలు నాటడం వంటి పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. మంగళవారం ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.

అంతేకాకుండా క్రమేటోరియంలకు సంబంధించిన పెండింగ్ పనులు పూర్తిచేయాలన్నారు. ఇంకా ఎక్కడైనా సోలార్ ప్లానెట్ ఏర్పాటు చేయాల్సి వస్తే వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ , డీఆర్డీవో కోదండరాములు, జెడ్పీటీసీ, ఈవో నరసింహులు హాజరయ్యారు.

ఇదీ చూడండి :ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధిపై చర్చకు సిద్ధం: జగదీశ్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details