వనపర్తి సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ తుది దశ పనులు.. త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ యాస్మిన్ అధికారులను ఆదేశించారు. నిర్మాణ పురోగతిపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. సీలింగ్ పనులు, విద్యుదీకరణ, తాగునీటి ఏర్పాట్లు, సీసీ రోడ్ల నిర్మాణం, మొక్కల పెంపకం, ఫౌంటెన్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని.. రోడ్లు, భవనాల శాఖ అధికారులను కోరారు.
తుది దశ పనులను వేగవంతం చేయండి: కలెక్టర్ - నూతన కలెక్టరేట్ భవనం
వనపర్తిలో నూతనంగా నిర్మిస్తోన్న సమీకృత కలెక్టరేట్ భవనాన్ని కలెక్టర్ యాస్మిన్ పరిశీలించారు. నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

wanaparthy collectorate
అనంతరం.. కలెక్టర్ వివిధ శాఖలకు కేటాయించిన గదులను పరిశీలించారు. నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను కోరారు.
ఇదీ చదవండి:పల్లె, పట్టణప్రగతి అమలు తీరుతెన్నులపై నేడు సీఎం కేసీఆర్ సమీక్ష