తెలంగాణ

telangana

ETV Bharat / state

వార్డుల్లో పర్యటించిన వనపర్తి కలెక్టర్ - collector visit wards at wanaparthy

స్వచ్ఛ వనపర్తి కార్యక్రమంలో భాగంగా పలు వార్డుల్లో జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి పర్యటించారు. దోమలు పెరగకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

వార్డుల్లో పర్యటించిన వనపర్తి కలెక్టర్

By

Published : Oct 26, 2019, 4:17 PM IST

వనపర్తి జిల్లాలో పారిశుద్ధ్యంపై 15 రోజుల ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా పలు వార్డుల్లో జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి పర్యటించారు. మురుగు కాలువలలో నీరు నిల్వ ఉండకుండా నీటి ప్రవాహం ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. దోమలు వృద్ధి చెందకుండా నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సానిటేషన్ మంచిగా మెయింటైన్ చేయాలని... పిచ్చి మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. కాలనీల్లోని పందులను దూరప్రాంతాలకు తక్షణమే తరలించాలని ఆదేశించారు.

వార్డుల్లో పర్యటించిన వనపర్తి కలెక్టర్

ABOUT THE AUTHOR

...view details