తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇసుక రీచ్​లపై నిఘా పెంచాలి : కలెక్టర్​ - ఇసుక రవాణాపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

జిల్లావ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు రెవెన్యూ అధికారులు నిఘా పెంచాలని వనపర్తి జిల్లా పాలనాధికారి యాస్మిన్ భాష వెల్లడించారు. ఇసుక రీచ్​లు ఉన్న గ్రామాల అభివృద్ధికి తీర్మానాలు పంపితే నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

wanaparthy collector review on sand committe  officers in collectorate
ఇసుక రీచ్​లపై నిఘా పెంచాలి : కలెక్టర్​

By

Published : Dec 29, 2020, 2:04 PM IST

Updated : Dec 29, 2020, 4:09 PM IST

ఇసుక అక్రమ రవాణాపై సర్పంచులు అధికారు యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్​ భాష సూచించారు. ఇసుక రీచ్​ల వద్ద సాంకేతిక కమిటీ ద్వారా సరిహద్దులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇసుక రీచ్​ల సహాయకులు పనితీరు సరిగా లేనందున 24 గంటలు రెవెన్యూ నిఘా ఉంచాలని కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శాండ్​ కమిటీ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.

ఇసుక రీచ్​లున్న గ్రామాల్లో తీర్మానాలు పంపితే ఇసుక కమిటీ నుంచి నిధులు విడుదల చేస్తామని కలెక్టర్​ స్పష్టం చేశారు. ఇసుక రీచ్​ల వద్ద సరిహద్దులను పిల్లర్లతో ఏర్పాటు చేయాలని రెవెన్యూశాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిర్మాణాలకు అవసరమైన ఇసుక అంచనాలను రూపొందించి పంపితే రిజర్వులో ఉంచుతామని కలెక్టర్ వెల్లడించారు. వినియోగదారులకు నాణ్యమైన ఇసుక ఒక ట్రిప్పు మాత్రమే ఇవ్వాలని... అధికంగా ఇస్తే సహించేది లేదని పాలనాధికారి హెచ్చరించారు. ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, జిల్లా మైనింగ్ ఇన్​ఛార్జ్ అధికారి విజయకుమార్, ఆర్డీవో అమరేందర్, ఆర్​డబ్ల్యూఎస్​, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్​శాఖ అధికారులు, సర్పంచులు హాజరయ్యారు.

ఇదీ చూడండి:కట్టినా కేటాయించట్లేరు.. కొన్నేమో సగంలో ఆపేశారు..!

Last Updated : Dec 29, 2020, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details