గ్రామాల్లో, పట్టణాల్లో పరిశుభ్రత పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష అధికారులను హెచ్చరించారు. వనపర్తి – పెబ్బెరు రహదారికి ఇరువైపుల హరితహారం కోసం తవ్విన గుంతలను, నాటిన మొక్కలను పరిశీలించారు. రహదారికి ఇరువైపులా పరిశుభ్రత లోపించడాన్ని గమనించిన కలెక్టర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశుభ్రత విషయంలో అలసత్వం వహిస్తే.. తీవ్రంగా పరిగణిస్తామని మున్సిపల్ కమిషనర్‌ను హెచ్చరించారు. హరితహారం కోసం తవ్విన గుంతల్లో మొక్కలు నాటి త్వరగా గుంతలు పూడ్చాలని ఆదేశించారు.
‘పరిశుభ్రత పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు’ - వనపర్తి కలెక్టర్ యాస్మిన్ బాష
గ్రామాల్లో, పట్టణాల్లో పరిశుభ్రత పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష హెచ్చరించారు. శనివారం వనపర్తి - పెబ్బేరు రహదారిలో పలు పనులను పరిశీలించారు. ఆర్డీవో కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
వనపర్తి పట్టణంలో చేపట్టిన డ్రైనేజీ పనులు త్వరగ పూర్తి చేయాలని ఆదేశించారు. వనపర్తి - చిట్యాల రహదారిలో శానిటేషన్ పనులను పర్యవేక్షించారు. పట్టణానికి నాలుగు వైపుల స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న నూతన కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ పనులు పరిశీలించారు. అనంతరం చిట్యాలలోని రైతు వేదిక పనులను, వైకుంఠధామం పనులు తనిఖీ చేశారు. రైతు వేదిక పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..