తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతు వేదికలను నాణ్యతతో నిర్మించాలి: జిల్లా కలెక్టర్​ - వనపర్తి జిల్లా వార్తలు

వనపర్తి జిల్లాలోని పలు మండలాల్లో నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్​ యాస్మిన్​ భాష పరిశీలించారు. రైతు వేదికలను పూర్తి నాణ్యతతో నిర్మించాలని అధికారులను ఆదేశించారు.

wanaparthy collector inspects farmer's platform construction works
రైతు వేదికలను నాణ్యతతో నిర్మించాలి: జిల్లా కలెక్టర్​

By

Published : Oct 6, 2020, 7:59 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు వేదికలను నాణ్యతతో నిర్మించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న రైతు వేదికల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. వనపర్తి జిల్లాలోని కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత, మదనాపురం మండలాల్లో నిర్మిస్తున్న రైతు వేదికలను ఆమె మంగళవారం పరిశీలించారు. దసరా పండుగ నాటికి నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో మొత్తం 71 రైతు వేదికలను నిర్మిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. వర్షం పేరుతో నిర్మాణాలు ఆగినప్పటికీ.. ఇప్పుడైనా రెట్టింపు వేగంతో పనులు చేయాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాణ్యతా లోపంతో నిర్మించే రైతు వేదికల బిల్లులను నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. పనులు వేగవంతంగా పూర్తయ్యేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపాలన్నారు.

ఇవీ చూడండి: దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాసరెడ్డి!

ABOUT THE AUTHOR

...view details