ప్రభుత్వం అమలు చేస్తున్న చేపపిల్లల పంపిణీ పథకాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రమాణాలకు అనుగుణంగా చేపపిల్లల్ని అందించకపోతే... వెనక్కి పంపాలని ఆయన మత్సకారుల్ని కోరారు. వనపర్తి జిల్లా మదనపురం మండలం సరళాసాగర్ జలాశయంలో... మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి.... 8లక్షల 20వేల చేపపిల్లల్ని వదిలారు.
నాణ్యతలో రాజీ పడొద్దు: మంత్రి తలసాని - Minister Talasani Srinivas Yadav
ప్రభుత్వం వందశాతం రాయితీలో అమలు చేస్తున్న చేపపిల్లల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మత్స సహకార సంఘాలపైనే ఉందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా చేపపిల్లల్ని అందించకపోతే నిర్దాక్షిణ్యంగా వెనక్కి పంపాలని ఆయన మత్సకారుల్ని కోరారు.
నాణ్యతలో రాజీ పడొద్దు: మంత్రి తలసాని
అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభించారు. సరళాసాగర్‌లో చేపల ఉత్పత్తి కేంద్రాన్ని పునరుద్ధరించాలని సూచించారు. దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి విన్నపం మేరకు.. భూత్పూర్లో చేపల మార్కెట్, దేవరకద్రలో పశువైద్య నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత ఆధికారులకు ఆయన సూచించారు.
ఇవీచూడండి:ఎల్ఆర్ఎస్కు భారీ సంఖ్యలో దరఖాస్తులు