వనపర్తి మున్సిపాలిటీ, మండలంలోని రాజపేట గ్రామంలో ధరణి పోర్టల్లో ఆస్తుల నమోదు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. ఆస్తుల నమోదుకు మున్సిపాలిటీలో, గ్రామాల్లో పర్యటించే ముందుగానే సిబ్బంది దండోరా వేసి ప్రజలకు తెలియజేయాలని కోరారు.
ధరణి పోర్టల్లో ఆస్తుల నమోదు.. క్షేత్ర స్థాయిలో కలెక్టర్ తనిఖీ - wanaparthi district Collector latest visit
ధరణి పోర్టల్లో ఆస్తుల నమోదు కోసం మున్సిపాలిటీలతోపాటు, గ్రామాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష కోరారు. ఆదివారం ఆమె వనపర్తి మున్సిపాలిటీతో పాటు రాజపేట గ్రామంలో ఆస్తుల నమోదు కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు.
ధరణి పోర్టల్లో ఆస్తుల నమోదు.. క్షేత్ర స్థాయిలో కలెక్టర్ తనిఖీ
అధికారులు, సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ప్రజలు సహకరించి ఆధార్, ఆహారభద్రత కార్డుతోపాటు, ఫోన్ నెంబర్ తదితర వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట వనపర్తి మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, వనపర్తి ఎంపీడీవో తదితరులు ఉన్నారు.