రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, గిఫ్ట్‌డీడ్ లాంటివి సులభంగా చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా ప్రజలను కోరారు. వనపర్తి తహసీల్దార్ కార్యాలయంలో ధరణి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఎవరైనా, ఎక్కడినుంచైనా వారి భూములకు సంబంధించిన వివరాలను ధరణి ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు.
ధరణి సేవలను సద్వినియోగం చేసుకోండి: వనపర్తి కలెక్టర్ - wanaparthy district latest news
జిల్లాలోని 14 తహసీల్దార్ కార్యాలయాల ద్వారా అందుబాటులో ఉన్న ధరణి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా కోరారు. వనపర్తి ఎమ్మార్వో ఆఫీసులో జరుగుతున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పరిశీలించారు.
ధరణి సేవలను సద్వినియోగం చేసుకోండి: వనపర్తి కలెక్టర్
జిల్లాలో 14 మండలాల్లోని తహసీల్దార్లు ధరణి సేవలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు 35 స్లాట్లు బుక్కయ్యాయని, వీటికి సంబంధించి అన్ని రిజిస్ట్రేషన్లు పూర్తి కాగా, అమ్మకందారులు రాని కారణంగా 8 పెండింగ్‌లో ఉన్నట్లు ఆమె వెల్లడించారు.
ఇదీ చూడండి:తహసీల్దార్ కార్యాలయంలో ధరణి ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్