వనపర్తి జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు ఆందోళనకు దిగారు. తమపై పని భారాన్ని తగ్గించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నామన్నారు. కుటుంబాలకు దూరమై పోతున్నామని చెప్పారు. సెలవుల మంజూరులో పారదర్శకంగా వ్యవహరించాలని జిల్లా పంచాయతీరాజ్ అధికారి రాజేశ్వరిని కోరారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు.
పని భారం తగ్గించండి: పంచాయతీ కార్యదర్శులు - పని భారం తగ్గించండి: కార్యదర్శులు
తమపై పని భారాన్ని తగ్గించాలని కోరుతూ వనపర్తి జిల్లా పంచాయతీ కార్యదర్శులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.
పంచాయతీరాజ్ అధికారినితో కార్యదర్శులు