వరణుడి కరుణ కోసం గంప జాతర - wanaparthy
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలరోజులు కావొస్తున్నా వాన జాడే లేదు. దుక్కులు దున్ని వరుణడి రాక కోసం రైతులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వనపర్తి జిల్లా వెల్దూర్ గ్రామస్థులు వరుణుడి కరుణించాలని కోరుతూ గంప జాతర నిర్వహించారు.
వనపర్తి జిల్లా చిన్నాంబావి మండలం వెల్దూర్ గ్రామంలో వానలు కురవాలని గంప జాతర జరిపారు. ఊరు ఊరంతా కలిసి గంపలు నెత్తిన పెట్టుకుని డప్పు చప్పుళ్లతో కృష్ణా నది వద్దకు చేరుకున్నారు. వెంట తీసుకెళ్లిన సామగ్రితో వంట చేసి కృష్ణమ్మకు నైవేద్యం సమర్పించారు. మొక్కులు తీర్చుకున్నాక గ్రామస్థులంతా కలిసి వనభోజనం చేశారు. అనంతరం వెంట తీసుకుకెళ్లిన సామగ్రి అంతా నదిలో వదిలేసి ఇంటికి చేరుకుంటారు. వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఈ జాతర నిర్వహిస్తామని గ్రామస్థులు తెలిపారు.
- ఇదీ చూడండి : జ్ఞాపకశక్తికి కేరాఫ్ అడ్రస్ ఈ బుడతడు