తెలంగాణ

telangana

ETV Bharat / state

'సమీకృత మార్కెట్ యార్డులతో రైతులకు మేలు' - Collector inspecting the integrated market yard

సమీకృత మార్కెట్ యార్డుల వల్ల రైతులకు, పేద ప్రజలకు మేలు జరుగుతుందని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో కలిసి మార్కెట్ యార్డ్ నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. అభివృద్ధి పనులను ఎవరైనా అడ్డుకుంటే కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

Collector inspecting the integrated market yard
సమీకృత మార్కెట్ యార్డ్‌ను పరిశీలించిన కలెక్టర్

By

Published : Apr 3, 2021, 1:19 PM IST

ప్రతి పురపాలిక పరిధిలో ఒక సమీకృత మార్కెట్ యార్డ్‌ నిర్మించడం వల్ల... సరసమైన ధరలకు కూరగాయలు లభిస్తాయని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లాలోని అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలో కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాతో కలిసి మార్కెట్ యార్డ్ నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో మార్కెట్ యార్డుల కోసం ప్రభుత్వం రూ.500 కోట్లు మంజూరు చేసిందని కలెక్టర్ పేర్కొన్నారు.

సమీకృత మార్కెట్ యార్డులో కూరగాయలు, మాంసాహార ఉత్పత్తులు, చేపలు నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా విక్రయాలు జరుగుతాయని తెలిపారు. ఈ మార్కెట్ల ద్వారా అటు రైతులు, ఇటు ప్రజలు లబ్ది పొందుతారన్నారు. అభివృద్ధి పనులను ఎవరైనా అడ్డుకుంటే కేసులు నమోదు చేయాలని ఆమె ఆదేశించారు. పోలీసు బందోబస్తుతో పనులు పూర్తిచేయాలని కమిషనర్‌ రమేశ్‌కు సుచించారు.

ఇదీ చదవండి:ఇద్దరి లోకం ఒకటే కావాలంటే.. ఇవి పాటించండి!

ABOUT THE AUTHOR

...view details