రెండో విడత ప్రాదేశిక ఎన్నికల ప్రచారం ముమ్మరం
ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు ప్రచారాలను ముమ్మరం చేస్తున్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో కూలీలు ఉదయాన్నే పనికి వెళ్తుంటే వారి వద్దకు వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.
ఉపాధి కూలీలవద్దకు వెళ్లి ఓట్ల అభ్యర్థన
ప్రాదేశిక రెండో విడత ఎన్నికల ప్రచారాన్ని వనపర్తి జిల్లాలోని పెద్దమందడి మండలంలో నాయకులు జోరుగా సాగిస్తున్నారు. గ్రామాల్లోని ఉపాధిహామీ కూలీల వద్దకు వెళ్లి తమకు ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. తెరాస, కాంగ్రెస్, భాజపాకు చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రచారాన్ని చేస్తూ... తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.
Last Updated : May 8, 2019, 3:31 PM IST