ఎలాంటి కారణం లేకుండా నిర్లక్ష్య వైఖరితో కారులో, ద్విచక్ర వాహనాలపై పట్టణంలో తిరుగాడే వ్యక్తులను గుర్తించి వారి పట్ల వనపర్తి పట్టణ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పట్టణంలోని పొట్టి శ్రీరాములు చౌరస్తా వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు 181 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
వనపర్తిలో 181 వాహనాలు సీజ్ - నిబంధనలను ఉల్లంఘించిన వాహనాలను వనపర్తి పోలీసు సీజ్ చేశారు
లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి అనవసరంగా రహదారులపై తిరిగే వాహనచోదకుల నుంచి 181 వాహనాలను వనపర్తి పోలీసులు సీజ్ చేశారు.
![వనపర్తిలో 181 వాహనాలు సీజ్ Unnecessarily, 181 vehicles on the roads were seized by wanaparty police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6832708-827-6832708-1587130723616.jpg)
అనవసరంగా రోడ్లపైకి వచ్చిన 181 వాహనాలు సీజ్
వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్డౌన్ నిబంధనను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ కిరణ్కుమార్ ప్రజలను హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని అలా వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్నారు.
ఇదీ చూడండి:లాక్డౌన్ ఉన్నా జల్లికట్టు ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు