తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆటో బోల్తా... ముగ్గురు మృతి... 16 మందికి గాయాలు - రోడ్డు ప్రమాద వార్తలు

ఒకే కుంటుబానికి చెందిన వ్యక్తులు ప్రయాణిస్తున్న ఆటో ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా... మరొకరు చికిత్స పొందతూ మరణించారు. మిగతా 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వనపర్తి జిల్లా రంగాపూర్​ వద్ద జరిగింది.

TWO DIED IN AUTO ACCIDENT AT RANGAPUR
TWO DIED IN AUTO ACCIDENT AT RANGAPUR

By

Published : Mar 7, 2020, 8:28 AM IST

Updated : Mar 7, 2020, 9:45 AM IST

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆటో బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. పెబ్బేరుకు చెందిన కుటుంబం ఎర్రవల్లి నుంచి పెబ్బేరుకు ఆటోలో ప్రయాణిస్తుండగా... ప్రమాదవశాత్తు రంగాపూర్​ సమీపంలో బోల్తా పడింది.

ఈ ఘటనలో ఎలీసా అనే బాలుడితో పాటు మరో వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందారు. మిగతా 17 మందికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఏడుగురిని మొదట వనపర్తి ఆసుపత్రికి, అక్కడి నుంచి మహబూబ్​నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న క్రమంలో మరో వ్యక్తి మరణించారు. మిగిలిన వారికి వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావటం వల్ల బంధువులంతా శోకసంద్రంలో మునిగిపోయారు.

ఆటో బోల్తా... ఇద్దరు మృతి... 16 మందికి గాయాలు

ఇవీ చూడండి:మద్యం దొంగలను పట్టించిన సీసీ కెమెరాలు

Last Updated : Mar 7, 2020, 9:45 AM IST

ABOUT THE AUTHOR

...view details