వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీని తెరాస కైవసం చేసుకుంది. మొత్తం 15 వార్డులకు గాను 10 వార్డుల్లో అధికార పార్టీ గెలవగా.. నాలిగింటిని భాజపా, ఒక వార్డులో కాంగ్రెస్ విజయం సాధించింది. 15 వార్డుల్లో గెలిచిన అభ్యర్థుల గెలుపును అధికారులు ధ్రువీకరించారు. ఛైర్మన్ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది. గెలిచిన అభ్యర్థులు సంబురాలు చేసుకున్నారు. మున్సిపల్ ఛైర్మన్గా తెరాస తమ అభ్యర్థిని ముందుగానే ప్రకటించింది. సుకేశిని విశ్వేశ్వర్ ఛైర్మన్ పీఠాన్ని చేపట్టనున్నారు.
బస్తీమే సవాల్: కొత్తకోట మున్సిపాలిటీ కారు వశం - Municipality results latest updates
వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగిరింది. పురపాలిక పరిధిలోని 15 వార్డుల్లో.. తెరాస మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి.. ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది.
కొత్తకోట మున్సిపాలిటీ కారు వశం
Last Updated : Jan 25, 2020, 12:39 PM IST