తెలంగాణ

telangana

ETV Bharat / state

వనపర్తి జిల్లాలో అధిక స్థానాలు తెరాసవే! - MPTC ZPTC

వనపర్తి జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల ఫలితాల్లో గులాబీ పార్టీ జయకేతం ఎగురవేసింది. 13 జడ్పీటీసీ స్థానాలు, 89 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకుని ఆధిక్యత కనబర్చింది.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాల్లో తెరాస జోరు

By

Published : Jun 4, 2019, 10:54 PM IST

Updated : Jun 5, 2019, 1:08 AM IST

వనపర్తి జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాల్లో తెరాస జోరు చూపింది. జిల్లాలో మొత్తం 14 జడ్పీటీసీ స్థానాలకు గానూ 13 స్థానాలు తెరాస గెలుచుకుని ఆధిక్యత కనబర్చింది. కాంగ్రెస్ ఒక్క స్థానానికి పరిమితమైంది. జిల్లాలోని 128 ఎంపీటీసీ స్థానాలకు గానూ 89 స్థానాల్లో తెరాస అభ్యర్థులు విజయం సాధించారు. 21 స్థానాలతో కాంగ్రెస్ రెండో స్థానానికి పరిమితమైంది. వామపక్ష పార్టీలకు ఒక స్థానం దక్కింది. ఇతరులు 17 ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించారు. తాజా ఫలితాలతో జిల్లాలోని తెరాస నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.

# తెరాస కాంగ్రెస్ వామపక్షం ఇతరులు మొత్తం
ఎంపీటీసీ 89 21 1 17 128
జడ్పీటీసీ 13 1 0 0 14
మండలం తెరాస కాంగ్రెస్​ భాజపా ఇతరులు మొత్తం
అమరచింత 4 0 0 1 5
ఆత్మకూర్​ 5 2 0 0 7
చిన్నంబావి 6 0 0 2 8
ఘన్​పూర్​ 6 5 0 1 12
గోపాల్​పేట 11 0 0 0 11
కొత్తకోట 8 3 0 1 12
మదనాపూర్​ 6 1 0 1 8
పానగల్​ 10 0 0 4 14
పెబ్బేరు 7 2 0 0 9
పెద్ద మందడి 10 1 0 0 11
రేవల్లి 2 3 0 1 6
శ్రీరంగాపూర్​ 4 1 0 1 6
వీపనగండ్ల 2 0 0 6 8
వనపర్తి 8 3 0 0 11
Last Updated : Jun 5, 2019, 1:08 AM IST

ABOUT THE AUTHOR

...view details