వనపర్తి జిల్లా కేంద్రంలో లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి.. రోడ్లపైకి వస్తున్న వారికి పోలీసులు విన్నూత రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. ఒంటి కాలిపై నిలబడి దండం పెడుతూ అనవసరంగా రోడ్లపైకి రావొద్దండూ వేడుకుంటున్నారు. మీ కోసం మా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నామని.. మా కోసం మీరు ఇళ్లలోనే ఉండాలని కోరుతున్నారు.
ఒంటికాలిపై నిలబడి పోలీసుల వినూత్న విన్నపం - ఒంటికాలిపై నిలబడి పోలీసుల వినూత్న విన్నపం
చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా.. కాళ్లు కూడా మొక్కుతా అడుగు బయటపెట్టకురా అని పోలీసులు ఎంతగా చెబుతున్నా కొందరు మాత్రం మారడం లేదు. అనవసరంగా రోడ్లపైకి వస్తూ వారికి భారంగా మారుతున్నారు.

ఒంటికాలిపై నిలబడి పోలీసుల వినూత్న విన్నపం