వనవర్తి జిల్లా మదనాపురం మండలం తీర్మాలయపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఇవాళ ఆదివారం కావటం వల్ల గ్రామానికి చెందిన ధర్మన్న అనే వ్యక్తి బీమా ఫేస్-2 కాలువలో చేపల వేటకు వెళ్లాడు. చేపలకు వల వేస్తుండగా ఆ వల కాళ్లకు చుట్టుకోని నీటిలో మునిగి మృతి చెందాడు.
చేపల వల కాళ్లకు చుట్టుకొని వ్యక్తి మృతి - The man went fishing was died due to drowned in canal
వనపర్తి జిల్లా మదనాపురం మండలం తీర్మాలయపల్లిలోని బీమా ఫేస్-2 కాలువలో చేపలు పట్టడానికి వెళ్లిన ధర్మన్న అనే వ్యక్తి కాళ్లకు వల చుట్టుకొని నీటిలో మునిగి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని... దర్యాప్తు చేస్తున్నారు.
చేపల వల చుట్టుకొని వ్యక్తి మృతి
కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నట్లు గ్రామస్థులు వెల్లడించారు. అతని మరణంతో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.