లాక్‌డౌన్ వేళ ఓ వైపు క్షణం తీరిక లేకుండా విధులు నిర్వర్తిస్తూనే.. మరోవైపు ఓ అనాథ వృద్ధురాలి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు పోలీసులు. వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రానికి చెందిన శకుంతల(83) అనారోగ్యంతో బాధపడుతూ గురువారం అర్ధరాత్రి మృతి చెందింది. పూరి గుడిసెలో నివసిస్తున్న ఆమెకు నా అనే వారే కరవయ్యారు.
Police: బంధువులు కరవై.. పోలీసులే ఆ నలుగురై! - అనాథ వృద్ధురాలి మృతదేహం
లాక్‌డౌన్ వేళ పోలీసులు మంచి మనసును చాటుకున్నారు. ఓ వైపు విధులు నిర్వహిస్తూనే మానవత్వం చూపించారు. వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రంలో ఓ అనాథ వృద్ధురాలి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి గొప్ప మనసు చాటుకున్నారు.
వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రంలో అనాథ వృద్ధురాలి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన పోలీసులు
కరోనాతో మరణించిందేమోనన్న అనుమానంతో ఆ వృద్ధురాలి మృతదేహాన్ని తరలించడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఎస్సై తిరుపాజీ.. శిక్షణ ఎస్సై రాజశేఖర్, సిబ్బంది కురుమన్న గౌడ్, రవికుమార్, శివకుమార్‌రెడ్డి, స్వాములు, అబ్దుల్ కలాంతో కలిసి ఆ అనాథ వృద్ధురాలి శవాన్ని పాడెపై శ్మశానానికి మోసుకెళ్లి ఖననం చేశారు. అన్నీ తామై అనాథ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన పోలీసులను పలువురు ప్రశంసించారు.
ఇదీ చూడండి:Drinking Water Bill: కరోనా సమయంలో జలమండలి నుంచి భారీ మొత్తంలో
Last Updated : May 29, 2021, 10:18 AM IST