తెలంగాణ

telangana

ETV Bharat / state

స్థిరాస్తి వివరాల నమోదు ప్రక్రియను వేగవంతం చెయ్యాలి: కలెక్టర్​ - యాస్మిన్​ భాష ధరణి సర్వేని పర్యవేక్షించారు

ఎల్ఆర్ఎస్ పథకంలో భాగంగా వనపర్తి పట్టణంలో చేపట్టిన ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష పరిశీలించారు. నిర్లక్ష్యం వహించకుండా కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

The Collector visited the town of Wanaparthy to find out how the Dharani survey was conducted
స్థిరాస్తి వివరాల నమోదు ప్రక్రియను వేగవంతంగా చేయాలి: కలెక్టర్​

By

Published : Oct 3, 2020, 11:35 AM IST

వనపర్తి పట్టణంలోని పలు కాలనీల్లో జిల్లా కలెక్టర్​ షేక్​ యాస్మిన్​ భాష పర్యటించారు. అధికారులు చేపట్టిన ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి కాలనీవాసుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఇతర జిల్లాల్లో సర్వే పనులు వేగవంతంగా జరుగుతున్నాయని... వనపర్తిలో అధికారులు ఇంకా పాత పద్ధతిలోనే నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని సర్వే పనులను వీలైనంత వేగవంతంగా పూర్తిచేయాలని ఆదేశించారు.

ఈ క్రమంలో ఆస్తులకు సంబంధించి యజమానులకు ఎలాంటి అనుమానాలు వచ్చిన వెంటనే నివృత్తి చేయాలన్నారు. గుర్తించిన స్థిరాస్తులకు సంబంధించి మెరూన్ కలర్ పాస్​పుస్తకాలను సూత్రప్రాయంగా జారీ చేయాలని అధికారులకు తెలిపారు.

ఇదీ చూడండి:ఆస్తుల విలువ నిర్ధారణ గడువులోగా పూర్తవుతుందా.. ?

ABOUT THE AUTHOR

...view details