తెలంగాణ

telangana

ETV Bharat / state

వనపర్తి మున్సిపల్ వార్షిక బడ్జెట్​ రూ.50.27 కోట్లు - వనపర్తి మున్సిపాలిటీ వార్షిక బడ్జెట్​

మున్సిపల్ కౌన్సిలర్లు బడ్జెట్​పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష అన్నారు. రూ. 50.27 కోట్లతో మున్సిపల్​ ఛైర్మన్​ బడ్జెట్​ ప్రవేశపెట్టారు.

The annual budget of the municipality of  Wanaparthi is Rs.50.27 crores
వనపర్తి మున్సిపల్ వార్షిక బడ్జెట్​ రూ.50.27 కోట్లు

By

Published : May 19, 2020, 2:30 PM IST

వనపర్తి మున్సిపల్ ఛైర్మన్ గట్టు యాదవ్ అధ్యక్షతన మున్సిపల్ బడ్జెట్ సమావేశం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్​ షేక్​ యాస్మిన్​ బాష హాజరయ్యారు. 2020-21 సంవత్సరానికి సంబంధించి మున్సిపాలిటీకి సుమారు 50.27 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్​లోని ప్రతి అంశంపై కౌన్సిలర్​లకు అవగాహన ఉన్నప్పుడే ఆదాయం, వ్యయంపై పట్టు ఉంటుందని కలెక్టర్​ పేర్కొన్నారు.

మున్సిపాలిటీలు ఆదాయం పెంచుకునే అంశాలపై పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. మున్సిపాలిటీలో తప్పకుండా వైకుంఠధామం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, కమ్యూనిటీ టాయిలెట్​లపై దృష్టిసారించాలని తెలిపారు. ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ డి.వేణు గోపాల్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, మేనేజర్ నరేష్, మున్సిపల్ కౌన్సిలర్లు, తదితరులు హాజరయ్యారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details