వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పామాపురంలోని శ్రీ భ్రమరాంబా సమేత రామేశ్వర ఆలయానికి భక్తులు తాకిడి పెరిగింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని.. భక్తులు, సమీపంలోని ఓ వాగులో నిర్మించిన 36అడుగుల శివుడి విగ్రహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
సంక్రాంతి సంబురం.. ఆలయాల్లో భక్తుల కోలాహలం - చెక్‌డ్యాం
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని వనపర్తి జిల్లాలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ భ్రమరాంబా సమేత రామేశ్వర ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
శ్రీ భ్రమరాంబా-రామేశ్వర ఆలయంలో భక్తుల కిటకిట
చెక్‌డ్యాంలో ఆలయ నిర్వాహకులు బోటు షికారును ఏర్పాటు చేయడంతో.. భక్తులు వాగులో విహరిస్తున్నారు. సెల్ఫీలు దిగుతూ.. సంబరాల్లో మునిగి తేలుతున్నారు.
ఇదీ చదవండి:అట్టహాసంగా ఐనవోలు మల్లన్న జాతర