Venugopala swamy Temple lands issue in Wanaparthy : వనపర్తి జిల్లా పెబ్బేరులో వేణుగోపాల స్వామి, ఆంజనేయ స్వామి ఆలయాలున్నాయి. వాటికి దేవుడి పేరుమీదున్న సర్వే నంబర్ 392లో 15.18ఎకరాలు 405లో 15.01ఎకరాలున్నాయి. ఖాస్రాలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పూజారి అంటూ మాఫీఇనామ్‌గా నమోదయ్యింది. ఐతే పాత పహానీల్లో మాత్రం శ్రీవేణుగోపాలస్వామి ఆలయ పూజారి నంబి రామలక్ష్మయ్య పేరిట దేవస్థానం ఇనాంభూమి నమోదై ఉంది. ఆ భూములకు ఓఆర్సీ తెచ్చుకునేందుకు గతంలో కొందరు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇటీవల ఆ భూములకు ప్రభుత్వం ఓఆర్సీ ఇవ్వడంతో వివాదం రాజుకుంది.
Temple land occupied in wanaparthy : ఆలయ భూముల్లో 40 ఏళ్లుగా పెబ్బేరు సంతనడుస్తోంది. పశువులు, గొర్రెలు, రైతుబజారు కలిపి ప్రతి శనివారం అక్కడే సంత నిర్వహిస్తారు. మిగతా రోజుల్లో ఆ స్థలం ఖాళీగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి వ్యాపారులు ఆ సంతకు వస్తుంటారు. తద్వారా పురపాలికకు ఏటా 3కోట్ల ఆదాయం వస్తోంది. ఆలయ భూమికి ఓఆర్సీ ఇచ్చి పట్టాలు చేయడంపై స్థానికులు పెద్దఎత్తున ఉద్యమించారు. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత రంగంలోకి దిగారు.
Lands kabza in Telangana : 30ఎకరాల్లో ఓఆర్సీ ఇచ్చి, పట్టాలు పొందిన వారితో సంతకు 16ఎకరాల స్థలాన్ని స్వచ్ఛందంగా ఇస్తున్నట్లుగా ఈ మార్చి 1న 12.28 ఎకరాలను పెబ్బేరు తహసీల్దారు పేరిట గిఫ్ట్‌డీడ్ చేశారు. మరో 3.12 ఎకరాలను త్వరలోనే తహసీల్దారు పేరు మీద గిఫ్ట్‌డీడ్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ భూములను పట్టాగా మార్చి అందులో సగం కాజేసి, మరోసగం ప్రభుత్వానికి గిఫ్ట్ డీడ్‌గా ఇస్తున్నట్లు ప్రణాళిక రచించారు. సంతకు 16 ఎకరాల భూమి సరిపోదని స్థానికులు అభ్యంతరం తెలిపారు. మిగిలిన భూమినీ వదులుకోబోమని స్పష్టం చేస్తున్నారు.