రాష్ట్ర అభివృద్ధికి గ్రామాలే పట్టుగొమ్మలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ జీవితానికీ మరేదీ సాటిరాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో గ్రామాలన్నీ పచ్చదనాన్ని సంతరించుకున్నాయని తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రచయితల పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు.
పల్లెలకు మించిన జీవితం మరెక్కడా లేదు: నిరంజన్ రెడ్డి - గ్రామాలే అభివృద్ధికి పునాదులన్న మంత్రి
గ్రామాలను మించిన జీవితం మరెక్కడా లేదని రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక సస్యశ్యామలంగా మారిందని తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు.
రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి కీర్తి పండుగ : నిరంజన్ రెడ్డి
గతంలో సంక్రాంతిని కీడుగా భావించేవారని.. రాష్ట్రం ఏర్పడ్డాక గొప్ప కీర్తి పండుగగా విలాసిల్లుతోందని అన్నారు. ఈ సందర్భంగా పుస్తకాలు రచించిన కవులకు ఆయన అభినందనలు తెలియజేశారు. తెలుగు సాహిత్యంపై అభిరుచి ఉన్నవారు భాష అభివృద్ధికి మరింత కృషి చేయాలని మంత్రి సూచించారు.