జూరాల ఎడమ కాల్వ, బీమా 16వ ప్యాకేజీ కింద ఉన్న చివరి ఆయకట్టు స్థిరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద ఉన్న సింగోటం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి గోపల్ దిన్నె జలాశయాన్ని అనుసంధానించేందుకు కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది.
జూరాల ఎడమ కాల్వ ఆయకట్టు స్థిరీకరణకు సర్కార్ అనుమతి - Left canal strategic stabilization of the jurala project
జూరాల ఎడమ కాల్వ, బీమా 16వ ప్యాకేజీ కింద ఉన్న చివరి ఆయకట్టు స్థిరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
జూరాల ఎడమ కాల్వ ఆయకట్టు స్థిరీకరణకు సర్కార్ అనుమతి
అందుకు అనుగుణంగా నీటిపారుదల శాఖ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. 147.10 కోట్ల రూపాయల వ్యయంతో లింక్ కాల్వ చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అనుసంధానంతో వనపర్తి జిల్లాలోని వీపనగండ్ల, చిన్నంబావి మండలాల్లోని 30వేల ఎకరాలకు సాగునీరు అందనుండటం వల్ల ఈ మండలాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.